ప్రజలకు ఎదో ఒకటి చేయాలన్న తపన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లో కన్పిస్తోందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు . కానీ ఆయన ఇస్తున్న హామీలే ఆందోళన ను , భయాన్ని  కలిగిస్తున్నాయని చెప్పారు . అమ్మ ఒడి , రైతు పెట్టుబడి వంటి పథకాలకు జగన్ ఎక్కడి నుంచి నిధులు తీసుకువస్తారని ప్రశ్నించారు . ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని , ఇటువంటి తరుణం లో ఆర్ధిక భారం తో కూడిన హామీలు ఇవ్వడం కరెక్టు కాదని చెప్పారు .


జగన్ నెలరోజుల పాలనా పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమన్న ఆయన , కేబినెట్ లో అనుభవజ్ఞులైన మంత్రులు ఉండాల్సిన  అవసరం ఎంతో ఉందన్నారు . కానీ జగన్ కేబినెట్ కూర్పు ఆలా లేదని వ్యాఖ్యానించారు . జగన్ నూతనంగా చేపట్టదల్చిన  గ్రామ వలంటీర్ల నియామకం కూడా సక్సెస్ అవుతుందని తాను భావించడం లేదని , ఈ వ్యవస్థ వల్ల గ్రామాల్లో లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు .


 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన నాదెండ్ల భాస్కర్ రావు, ఆ తరువాత ఆయన్నే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారన్న  అపవాదు మూటగట్టుకున్నారు  . ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సహకారం తో ముఖ్యమంత్రి పీఠం పై ఆశీనుడైన నాదెండ్ల , తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ధాటికి నెలరోజులకు పదవీచ్యుతుడయ్యారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: