ప్రపంచంలో గాంధీజీ గురించి తెలియని వ్యక్తి ఉండరు.  దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో గాంధీజీ ఒకరు.  స్వాతంత్రం కోసం పోరాటం చేశారు గాని,  ఎప్పుడు కూడా రాజకీయాల గురించి పోరాటం చేయలేదు.  అవసరమైతే ఆయన అప్పట్లో దేశానికి ప్రధాని కాగల సత్తా ఉన్నా వాటిని పక్కన పెట్టారు కాబట్టే ఇప్పుడు గాంధీ పేరు దేశంలో చిరస్థాయిగానిలిచిపోయింది.  


నెహ్రు కూతురు ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత గాంధీ పాలన మొదలైంది.  ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షా పదవి చేతులు మారలేదు.  ఒకటి రెండు సార్లు చేతులు మారినా అది తాత్కాలికమే.  అయితే, ఇప్పుడు మరోమారు చేతులు మారుతున్నది.  


గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  అయితే, దీనిని పార్టీ ఆమోదించలేదు.  చివరకు అయన తన రాజీనామాను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆమోదించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.  దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా పార్టీకి వినయ విధేయములుగా ఉన్న వోరా ను నియమించింది.  


కానీ, జాతీయ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషణ సాగిస్తోంది.  సుశీల్ కుమార్ షిండే లేదా మల్లిఖార్జున ఖర్గే లపేర్లు వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో కుటుంబానికి పాలనా మారిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: