వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు చకచకా తీసుకుంటున్నారు.  రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  పాలన విషయంలో ప్రతి శాఖలో కూడా ప్రక్షాళన చేపట్టడమే కాకుండా... ప్రతి శాఖలో రివ్యూ చేస్తూ.. తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరిస్తున్నారు.  


జగన్ పక్కనున్న రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటున్నారు. తన ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆహ్వానించారు.  అలానే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది.  రెండు రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో సహకరించుకుంటున్నాయి.  


రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల విషయంలో కూడా కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  రాష్ట్రాల విభజనకు సంబంధించిన షెడ్యూల్ 9-10 కింద ఆస్తుల పంపకం గురించి చర్చలు జరిగాయి.  ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు.  


అయితే, ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఈ షెడ్యూల్ లో కింద బ్యాంకుల్లో ఉన్న 20వేల కోట్ల రూపాయలను రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవడానికి అంగీకరించారు.  అయితే, స్థిర ఆస్తుల పంపకం విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయం భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.  హైదరాబాద్ లో ఉన్న స్థిర ఆస్తులను తెలంగాణాకే చెందాలని కెసిఆర్ పట్టుబట్టారు కెసిఆర్.  దీనికి జగన్ అంగీకరించలేదని తెలుస్తోంది.  ఈరోజు జరగాల్సిన సీఎస్ ల సమావేశానికి వెళ్లోద్దని జగన్ తెలిపినట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: