పదేళ్ల పోరాటం తరువాత జగన్ సీఎం అయ్యారు. ఆయన ఇంకా సీట్లో కుదురుకోలేదు. గట్టిగా చూస్తే నెల రోజులు మాత్రమే గడిచాయి. ఇంతలోనే జగన్ విషయంలో పొగడ్త్లలు వస్తున్నాయి. విమర్శలు వస్తున్నాయి.  జగన్ గ్రేట్ అని కొందరు అంటే ఇంకా చూడాలి అని మరి  కొందరు అంటున్నారు.


అయతే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాత్రం జగన్ గొప్ప ముఖ్యమంత్రి  అని కొనియాడారు తన నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో జగన్ లాంటి సీఎం ని ఎక్కడా చూడలేదని ఆయన కితాబు ఇచ్చారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ జగన్ తనదైన ముద్రను వేశారని దాడి కొనియాడారు.


ఏళ్ళలకు ఏళ్ళు సీఎం లుగా చేసిన వారు కూడా తీసుకోలేని అనేక నిర్ణయాలు జగన్ ఒక్క నెల రోజుల్లోనే తీసుకుని శభాష్ అనిపించారని ఆయన అన్నారు. జగన్ అవినీతి లేని స్వచ్చమైన పాలన అందిస్తారని తాను భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుర్చీ భక్తి  ఉందని, ఆయన ఆస్తికుడు కానే కాదని దాడి అన్నారు. మొత్తానికి జగన్ పాలనకు నూరు మార్కులు ఈ మాజీ మంత్రి వేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: