ఏపీలో రాజకీయ భూకంపం రాబోతోందని దాదాపు పది, పదిహేను రోజుల నుంచి మీడియాలో ఒకటే కథనాలు వచ్చాయి. ఇంకేముంది.. ఏపీ టీడీపీ మొత్తం ఖాళీ కాబోతోంది.. చంద్రబాబు, లోకేశ్ తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో ఉండరేమో అన్నంతగా ప్రచారం జరిగింది.


టీడీపీ లోక్ సభ పక్షాన్ని చీల్చిన బీజేపీ సేమ్ సీన్ ఏపీ అసెంబ్లీలోనూ వస్తుందని చెప్పుకొచ్చింది. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు రెడీ అయ్యారని చెప్పి దాదాపు పది రోజులు కావస్తోంది. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేసరికి ఆ పార్టీ ఖాళీ అవుతుందని కొందరు ఔత్సాహిక బీజేపీ యువ నేతలు సెటైర్లు కూడా వేశారు.


కానీ.. ఇంతవరకూ ఒక్క పెద్ద లీడర్ కూడా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లలేదు. ఎంపీల జంపింగ్ తర్వాత చిన్నాచితకా లీడర్లు తప్ప మిగిలినవారంతా చంద్రబాబు వెంటే అంటున్నారు. మరి బీజేపీ ఏ ధైర్యంతో అన్ని కబుర్లు చెప్పింది. చివరకు కమలనాథులు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు చేస్తున్నారు.


మరి ఈ ట్విస్టులకు కారణమేంటి.. చంద్రబాబు పార్టీని బాగా కాపాడుకుంటున్నారా.. లేక టీడీపీ నేతలను కన్విన్స్ చేయడంలో బీజేపీ ఫెయిలైందా.. లేక అండర్ కరెంట్ గా జంపింగ్ కు అంతా రంగం సిద్ధమవుతుందా.. ఏమో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: