కుప్పం పర్యటనలో చంద్రబాబు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే.. అది ఆయన అమాయకత్వమా.. లేక అతి తెలివా అన్నది అర్థం కావడం లేదు. ప్రజాతీర్పు వచ్చి దాదాపు 40 రోజులు గడుస్తున్నా ఆయనకు ఆ తీర్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదట.. నేనేం తప్పు చేశానంటూ ఆయన ప్రజలను అడుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.


ఆయన కుప్పం పర్యటనలో ఏమన్నారంటే.. ‘ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరీ 23 సీట్లకు పరిమితమయ్యేలా నేనేం తప్పు చేశానని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా..


రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డా. ఒకటికి పదిసార్లు ఆయా కంపెనీల చుట్టూ తిరిగా. దక్షిణ కొరియా వెళ్లి కియా పరిశ్రమను అనంతపురానికి తెచ్చా. అయినా.. ఆ సీటును కూడా గెలవలేకపోయాం. ఏం తప్పు చేశామో అర్థం కావడంలా.


పాపం.. చంద్రబాబుపైకి అలా మాట్లాడుతున్నారు కానీ.. తెలుగుదేశం ఓటమికి కారణాలేంటో ఆయనకు తెలియనివికావు.. కానీ జనం.. తప్పు చేశారని వారికే తెలియజెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. చేసిన తప్పులు ఒప్పుకోకుండా.. తానేం చేసినా అదే రైటు అనే తత్వం ఇంకా చంద్రబాబుకు పోలేదన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: