40 ఇయర్స్ ఇండస్ట్రీ.. చంద్రబాబు తరచూ చెప్పుకునే గొప్ప ఇది.. దేశంలోనే నా అంత సీనియర్ లేరు అంటూ ఆయన గత ఎన్నికల సభల్లో మహా ఘనంగా చెప్పుకున్నారు. కానీ ఆ మాటలను జనం లక్ష్య పెట్టలేదు.. అనుభవం లేకపోయినా జగనే కావాలని కోరుకున్నారు.


అయినా చంద్రబాబు మాత్రం ఇంకా తన సీనియారిటీ గురించి, అనుభవం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రం మానడం లేదు. ఆయన తాజాగా ఓ సభలో మాట్లాడుతూ... వైసీపీ ఇచ్చిన హామీలన్నీ అలవికానివే. వాటిని ఎవరూ తీర్చలేరు.. అంటూ తీర్పు చెప్పేశారు.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం, సీపీఎస్‌ రద్దు వంటివి జరిగే అవకాశమే లేదని చంద్రబాబు చెబుతున్నారు. ఇంత అనుభవం ఉండీ నేనెందుకు చేయ లేకపోయానో ఆలోచించండి... అంటూ ప్రజలకు వివరిస్తున్నారు.


ఆర్టీసీ విలీనం దిశగా ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. ఆ దిశగా చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా ప్రారంభమైంది. సీపీఎస్ రద్దు గురించి కూడా జగన్ ప్రాథమికంగా ఓకే చెప్పేశారు. మరి ఈ మూడు హామీలు నెరవేరిస్తే.. పాపం.. చంద్రబాబు సీనియారిటీ నవ్వులపాలు కావాల్సిందేనా..?


మరింత సమాచారం తెలుసుకోండి: