సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే జగన్ చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టాడు. అవి ఏమిటంటే వృద్ధాప్య ఫింఛన్ వయసును 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకు తగ్గించడంతో పాటు ఫింఛన్ 2250 రుపాయలకు పెంచాడు. అంగన్ వాడీ వర్కర్ల జీతాలు 11,500 రుపాయలకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18 వేల రుపాయలకు పెంచాడు. అమ్మఒడి పథకాన్ని పాఠశాలలకే పరిమితం చేయకుండా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా వర్తించేలా చేసాడు. 
 
మధ్యాహ్న భోజన పథకానికి పని చేసే వారి జీతాన్ని కూడా 3000 రుపాయలకు పెంచాడు. పోలీసులకు వీక్లీ ఆఫ్, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటున్నాడు. రివర్స్ టెండరింగ్ అమలు చేయబోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వలంటీర్లను ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున నియమించబోతున్నాడు. 
 
అక్టోబర్ 1 లోపు బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాడు. అక్టోబర్ 15 నుండి రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నాడు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాడు. ప్రజలకు ఉపయోగపడేలా సెప్టెంబర్ 1 నుండి సన్న బియ్యం గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చాడు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: