ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలో అరెస్ట్ అవ్వనున్నారట. బాబుని అరెస్ట్ చెయ్యడానికి తేరా వెనకాల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయట. ఓటుకు నోటు సహా ఇతర అవినీతి కేసుల్లో బాబు అరెస్ట్ అవ్వచ్చని, ఔట్ లుక్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్ధలు కథనాల్లో తెలిపాయి. ఈ కథనాల్లో నిజం ఎంత ఉంది ? 


గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు వస్తూనే వున్నాయి అయితే ఇప్పుడు జాతీయ మీడియాల్లో కూడా ఈ వార్తలు రావడం గమనార్హం. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళు ఉన్న వైఎస్ జగన్ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గత 9 సంవత్సలుగా చంద్రబాబు, వైఎస్ జగన్ తో ఎలా ఆడుకున్నారో అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబుతో కూడా ఒక రేంజ్ లో ఆడుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో అక్రమాస్తుల కేసులో జగన్ ను జైల్లో పెట్టించారు. 


ఇప్పుడు నిజమైన కేసుల్లో చంద్రబాబుని జైల్లో పెట్టించనున్నారు వైఎస్ జగన్. దీంతో తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్టాలు పడుతుంది. చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ఎప్పుడు చుసిన ట్విట్టర్ లో తప్ప బయట కనిపించటం లేదు. ఇవి అన్ని గమనిస్తున్న ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధమని గ్రహించిన '18మంది టీడీపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదిస్తున్నారు' అని ఏపీ బీజేపీ సహా ఇంచార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యలు చేసారు. మరి చంద్రబాబు అరెస్ట్ అయ్యి 18 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడి టీడీపీని భూస్థాపితం చేస్తారా ? వైసీపీకి ప్రతిపక్షం లేకుండా చేస్తారా ? అనేది త్వరలోనే తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: