చంద్రబాబునాయుడు కరకట్ట మీద నివాసం ఉంటున్న భవనం అక్రమనిర్మాణమని తేలిపోయింది. అయితే గుంటూరులో నిర్మించిన పార్టీ కార్యాలయం కూడా అక్రమ భవనమే అని తాజా వివరాలు ప్రకారం అర్ధమవుతోంది. గుంటూరులోని అరండల్ పేటలో 1999లో నిర్మించిన కార్యాలయం నుండే చంద్రబాబు కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజగా కార్పొరేష్ లెక్కల ప్రకారం ఆ భవనం కూడా పక్కనున్న స్ధలాన్ని అక్రమించి నిర్మించేందే అన్న విషయం బయటపడింది.

 

1999లో అప్పటి గుంటూరు మున్సిపల్  కార్పొరేషన్ నుండి వెయ్యి గజాల స్ధలం టిడిపి లీజుకు తీసుకున్నది. అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి లీజు కూడా తేలిగ్గానే వచ్చేసింది. అయితే తీసుకున్న స్ధలంలో భవనం కట్టుకుని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. కానీ పక్కనే ఖాళీగా ఉన్న మరో 1637 గజాల స్ధలంపైన కూడా నేతల కన్నుపడింది. ఎటూ అధికారంలో ఉన్నారు కదా వెంటనే కబ్జా చేసేశారు.

 

పక్కనున్న స్ధలం కబ్జా చేసేయగానే వెంటనే రెండు స్ధలాలను కలిపేసి కాంపౌండ్ కట్టేసి పార్టీ కార్యాలయాన్ని నిర్మించేసుకున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే సదరు అడ్రస్ లో అసలు భవనం ఉన్నట్లు ప్రస్తుతం కార్పొరేషన్ రికార్డుల్లోనే నమోదు కాలేదట. అంటే ఇది కూడా అక్రమమే. కేవలం వెయ్యి గజాల స్ధలాన్ని లీజుకు ఇచ్చే విషయం మాత్రమే రికార్డుల్లో ఉంది.

 

అంటే పక్క స్ధలాన్ని అక్రమించుకోవటం, పార్టీ కార్యాలయం నిర్మింటం లాంటివన్నీ అనధికారికంగా జరిగిపోయాయి. అంటే గడచిన 20 ఏళ్ళుగా గుంటూరులోని పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణంగానే చెలామణి అయిపోతోంది. అదేమిటో చంద్రబాబు ఉంటున్న భవనం అక్రమనిర్మాణం. కట్టిన పార్టీ కార్యాలయం అక్రమనిర్మాణం. రాష్ట్రం మొత్తం మీద టిడిపి కార్యాలయాల భవనాల లెక్కలను తీస్తే ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు బయటపడతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: