2019 ఎన్నికల ఫలితాల తరువాత జనసేన పార్టీ పరిస్థితి చెప్పుకునేంత గొప్పగా మాత్రం లేదు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల నుండి ఓడిపోవటం జనసేన అభిమానుల్ని తీవ్రంగా భాదపెట్టింది. జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకోవడం వల్ల జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేకపోయింది. పోటీ చేసిన స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. 
 
కానీ జనసేన పార్టీ ఓడిపోవటానికి గల కారణాలలో ముఖ్యమైనది జనసేన పార్టీలో కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే ఉండటం, పవన్ కల్యాణ్ తరువాత ఆ స్థాయి నాయకులు జనసేనలో లేకపోవటం. ఈ సమస్య వలన కేవలం అగ్ర స్థాయి నాయకులు మాత్రమే పవన్ కల్యాణ్ ను కలిసే వీలుండేది. కానీ త్వరలో పవన్ కల్యాణ్ తన సోదరుడైన నాగబాబుని జనసేన సమన్వయ కమిటీకి అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు తెలుస్తుంది. 
 
గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయాల్లో నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో సమావేశాలు నిర్వహించేవాడు. జనసేన పార్టీలో కూడా నాగబాబు సమన్వయ కమిటీకి అధ్యక్షుడిగా ఏర్పాటైతే జనసేన అభిమానులు, కార్యకర్తలతో, నాయకులతో సమావేశాలు నిర్వహించటం ద్వారా జనసేన పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం అయ్యేలా చేయవచ్చు. పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం కొన్ని నెలల ముందే తీసుకుని ఉంటే జనసేన ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేదేమో. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: