జగన్‌ ఆహ్వానం, జేపీ షాక్‌..?

ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో ఎన్నికలో విజయవిహారం చేసిన వై ఎస్‌ జగన్‌ని ఆ మేధావి మర్యాద కోసం అయినా అభినందించ లేదు.

పైగా ఆ సినిమా యాక్టర్‌ ఎందుకు ఓడి పోయాడని..? ఏదో చానెల్‌ వారు అడిగితే , గాంధీ మహాత్ముడు కూడా ఓడిపోయాడు, ఎన్నికల్లో గెలుపు ఓటములు నిజం కాదు, డబ్బు ఖర్చు చేయకుండా ఎవరైనా గెలిచారా..? అని పరోక్షంగా వైసీపీ పార్టీని కౌంటర్‌ చేస్తూ సమాధానం చెప్పారు. క్రిష్ణానదిని కాపాడ డానికి ఇటీవల కరకట్టమీది అక్రమ కట్టడం కూల్చివేసినపుడు కూడా జగన్‌ని మెచ్చుకోవడానికి ఆయనకు మనసు రాలేదు.

కూల్చివేత తప్పు అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. ఆ మేధావి ఎవరో విజ్నులైన పాఠకులు ఇప్పటికే గుర్తించి ఉంటారు. ఆయనే, జయప్రకాశ్‌ నారాయణ.

తెలుగుదేశం కి అనుకూలంగా ఉంటారు అని ముద్రపడిన ఆయనను తెదేపా ప్రభుత్వం కూడా ఎప్పుడూ ,ఏ కార్యక్రమానికి పిలిచి, గౌరవం ఇవ్వలేదు. కనీసం అమరావతి శంకుస్థాపనకు కూడా ఆయన్ని ఆహ్వానించలేదు. అదలా ఉంటే , ఈరోజు జేపీ కూడా షాక్‌ అయ్యే ఆహ్వానం ఏపీ ప్రభుత్వం నుండి వచ్చింది.

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ , ఈ రోజు, ఎమ్మెల్యే ల అవగాహనా కార్యక్రమానికి జెపిని ఆహ్వానించారు.

ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి శిక్షణలో భాగంగా నేడు పలు కీలక అంశాలపై తరగతులు నిర్వహించనున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రసంగించారు 
  మధ్యాహ్నం   శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశం పై డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జయప్రకాష్ నారాయణ ప్రసంగించారు 

తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవించని జేపీ పట్ల , మనసులో ఏమీ పెట్టుకోకుండా, జగన్‌ చూపిన మర్యాదను పెద్దరికాన్ని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. జేపీ లోని మేధస్సుకు జగన్‌ ఇచ్చిన గౌరవం ఆయనలోని రాజకీయ పరిణితిని అద్దం పడుతోంది.

ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం మున్ముందు కూడా జెపి లాంటి మేధావుల సలహాలు తీసుకుంటారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: