నారా లోకేష్ ఈ పేరు తెలియనిది కాదు. 14 ఏళ్ళు ఏపీ సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఏకైక సుపుత్రుడు నారా లోకేష్. రాజకీయ అనుభవం అసలు లేకపోయినా ఎంపీగా పని చేశాడు తండ్రి ప్రభుత్వంలో. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగిన చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్... గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓటమి చవిచూశారు. అరంగేట్రంలోనే ఓటమి చవిచూసిన లోకేశ్ ఆ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఓటమిపాలైనప్పటి నుంచి ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో గోల పెట్టేస్తున్నాడు లోకేష్ బాబు. 


దీంతో నెటిజన్లకు చిరాకు వచ్చి గత నెలలో, లోకేష్ రాజకీయ భవిష్యత్తు గురించి సలహాలు కూడా ఇచ్చారు. ఓటమిపాలైనప్పుడు ఎలా మెలగాలో వైఎస్ జగన్ ను చూసి నేర్చుకో, వచ్చే ఎన్నికల్లో అయినా గెలుస్తావు అని. మరికొంతమంది, ఓడిపోయిన బుద్ధి తెచ్చుకోకుండా తెలుగు దేశం అది చేసింది ఇది చేసింది అని డబ్బా ఎందుకు కొట్టుకుంటావ్ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయినా వినకుండా రోజుకు 10 నుంచి 15 ట్విట్లు ఏకా దాటిగా పెడుతున్నాడు నారా లోకేష్. 


ఇవి మాత్రమే కాదండి.. ఇతను వైసీపీపై వేసే ప్రశ్నల్లో కూడా ఏమాత్రం నిజం ఉండదు. ఆ నిజంలేని ప్రశ్నలపై నెటిజన్లు తిరిగి ప్రశ్నలు వేస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వారిని బ్లాక్ కూడా చేస్తాడు మన లోకేష్ బాబు. నెటిజన్లు వూరికే ఉంటారా ఏంటి, మరో ట్విట్టర్ ఖాతా తెరిచి దాని నుంచి ఇతన్ని బ్లాక్ స్టార్ లోకేష్ అని పిలుస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ''ట్విట్టర్ ని నువ్ వదలవా, ప్రజలను నీ ప్రశ్నలతో చంపేస్తావా? ఏమైనా ఉంటె ప్రెస్ మీట్ పెట్టు రోజు ఏంటి ఈ గోల ?'' అని విరుచుకు పడ్డారు నెటిజన్లు. అయితే అటు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి ఇదే తరహాలో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: