జగన్ ప్రభుత్వం వచ్చి ఇంకా కనీసం నెల రోజులు కూడా కాకముందే చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందట! చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలకు ఈ విషయాన్ని సెలవిచ్చారట. ఎన్నికలు అయిపోయి రెండునెలలు అయినా సరిగా జరగలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు ఇలా కౌంట్ డౌన్లు, డేట్లు లెక్క పెడుతున్నట్టున్నారు! ఇంతకీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కౌంట్ డౌన్ మొదలైనట్టు?


అంటే.. పించన్లు సమయానికి ఇవ్వడం లేదట, విత్తనాల సరఫరాలో ప్రభుత్వం విఫలం అయ్యిందట, కరెంటు సరఫరా సరిగా లేదట! విత్తనాల సరఫరా అంశం గురించి తెలుగుదేశం పార్టీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. విత్తన సేకరణ సమయంలో కంపెనీలకు డబ్బులు చెల్లించనిది చంద్రబాబు సర్కారే. అప్పుడేమో ఉన్న డబ్బులంతా పసుపు కుంకుమ పేరుతో ఓట్లను కొనుగోలు చేయడానికి వాడారు. నిధులను పక్కదోవ పట్టించి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూశారు.


తీరా ఇప్పుడు విత్తన కొరత వచ్చింది. దానితో తెలుగుదేశం రాజకీయం చేస్తూ ఉంది. ప్రజలు మరీ అజ్ఞానులు, గొర్రెలు అనేది చంద్రబాబు లాజిక్ కావొచ్చు. అయితే ఆయనను చిత్తుగా ఓడించినా ఆ భ్రమలోనే ఉంటే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఇక పెంచిన పెన్షన్లను వారంరోజులు లేట్ గా ఇవ్వబోతున్నట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఈ మాత్రం దానికే కౌంట్ డౌన్ అంటే.. అది చంద్రబాబు నాయుడి రాజకీయం అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: