ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో ‘నవరత్నాల’ హామీలు ఒక్కొక్కటిగా అమలు పర్చేందుకు అన్నీ సిద్దం చేస్తున్నారు.  ఈ మద్య అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజావేదిక కూల్చి వేసిన విషయం తెలిసిందే.  


తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఏపి ప్రభుత్వం.  ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న జయరాం పై వేటు పడింది. ఉత్తర అమెరికాలో ఏపి ప్రభుత్వ ప్రతినిధి పదవి నుంచి తొలగింపు. అమెరికాలో చంద్రబాబు ఏజెంట్ గా వ్యవహరించిన కోమటి జయరాం.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు తరుపు నుంచి ప్రచారం చేసిన జయరాం. 

కాగా ఆయనపై ఇప్పటి వరకు ఎన్నో ఆరోపణలు వస్తున్నట్లు పలు వార్త కథనాలు వెలువడ్డాయి.  అమెరికాలో తెలుగు ప్రజల గౌరవాన్ని జయరాం తాకట్టు పెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి.  స్వప్రయోజనాల కోసం తానా కార్డును వాడుకున్న జయరాం పై ఆరోపణలు వచ్చాయి. కాగా.. టీడీపీ హయాంలో అమెరికా వ్యవహారాల్లో కోమటి కీలకంగా వ్యవహరించారు. ఏపీ ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, నేతలు అమెరికాకు వచ్చినా.. తెలుగువారికి సంబంధించిన సభలు ఏమైనా జరిగినా వీటన్నింటినీ జయరామే దగ్గరుండి చూసుకునే వారు. మరి ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: