రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిగారు సీఎం అయ్యేనాటికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లో ఉన్నా పథకాల అమలులో మాత్రం జగన్ వెనుకడుగు వేయట్లేదు. ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలను ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్నారు మరికొన్ని పథకాలను కొన్ని నెలల్లో అమలు చేయబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి కొత్త సమస్య మొదలైంది. 
 
కేంద్రం నుండి తీసుకునే విద్యుత్తుకు ఇంతకుముందు విద్యుత్తు తీసుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా బిల్లులు చెల్లించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా బ్యాంకుల్లో డబ్బును ముందుగానే జమ చేయాల్సి ఉంటుంది. అలా జమ చేసిన బ్యాంక్ హామీ ఇచ్చిన తరువాతే విద్యుత్ పంపిణీ చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
 
కేంద్రం అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వలన రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. వందల కోట్ల డబ్బు విద్యుత్ కొనుగోలుకు ప్రస్తుత ప్రభుత్వానికి అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు దీనికి కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితిలో సీఎం జగన్మోహన్ రెడ్డిగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: