చూస్తుంటే వ్యవహారం ఏదో తేడా కొట్టేట్లే ఉంది. తొందరలోనే జనసేన జెండా పీకేయంట ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిధుల కోసం జనాలను తలా వంద రూపాయలు ఇవ్వమంటూ పార్టీ తరపున శతఘ్ని పేరుతో ఓ ప్రకటన రావటమే అనుమానాలకు కారణమైంది.

 

ప్రతీ ఒక్కళ్ళు జనగణమన అని తలచుకుని జనసేనకు తలా వంద రూపాయల విరాళం ఇవ్వాలంటూ పార్టీ పిలుపిచ్చింది. తల వంద రూపాయలు ఎందుకివ్వాలో అర్ధం కావటం లేదు. ఎన్నికలకు ముందు విదేశాలకు వెళ్ళి  పవన్ నిధులను సేకరించారు. విదేశాల్లో సేకరిచింది కాకుండా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పోటీ చేయటానికి ఆసక్తి ఉన్న అనేక మంది నుండి భారీ ఎత్తున నిధులు సేకరించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 

మరి సేకరించిన నిధులన్నీ ఏమయ్యాయో లెక్కలు చెప్పటం లేదు. డబ్బులు సంపాదనకు తాను రాజకీయాల్లోకి ప్రవేశించలేదని పెద్ద గొప్పగా చెప్పుకున్న పవన్ ఇపుడు నిధులను ఎందుకు అడుగుతున్నట్లు ? గతంలో సేకరించిన నిధులకు లెక్కలు చెప్పి ఇపుడు మళ్ళీ నిధులు అడిగినా బావుంటుంది. ఆ విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు.

 

అవినీతి లేని రాజకీయాలు చేస్తానని చెప్పిన పవన్  తన కోటరిలోని కొందరు టికెట్లు ఇప్పించేందుకు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారని పార్టీ నేతలే ఆరోపించారు. మరి ఆ ఆరోపణలకు పవన్ ఇంత వరకూ ఎందుకని సమాధానం చెప్పలేదు. ఓ రాజకీయ  పార్టీని నడపటమంటే మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మరి అంత డబ్బు పవన్ ఎక్కడి నుండి తెస్తారు ? జనాలిచ్చే వంద రూపాయల విరాళాలు పవన్ ఖర్చులకు ఏమూలకు సరిపోదు. కాబట్టి జరుగుతున్నది చూస్తుంటే జనసేన జెండా పీకేసేందుకు ఎంతో కాలం పట్టేట్లు లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: