అధికారం లో ఉన్న అన్ని పార్టీలు , ప్రజాప్రతినిధుల  ఫిరాయింపులను ప్రోత్సాహాహిస్తున్నాయి . పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైకాపా , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నది జగమెరిగిన సత్యమే . అధికారం లో ఉన్నప్పుడే కాదు… ప్రతిపక్షం లో ఉన్ననాడు కూడా ఆయన పార్టీ ఫిరాయింపులను దూరంగా ఉన్నారు .


ఫిరాయింపు రాజకీయాలపై  మార్కెట్ లో ప్రజాస్వామ్యం అనే   చిత్రాన్ని పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి రూపొందిస్తున్నాడు . పార్టీ ఫిరాయింపులకు నో చెప్పిన జగన్మోహన్ రెడ్డి ని ఈ సందర్బంగా పీపుల్స్ స్టార్ అభినందించారు . కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని నారాయణమూర్తి అన్నాడు.  ఒక పార్టీ తరుపున ఎన్నికైన ప్రజాప్రతినిధిని అధికారం లో ఉన్న పార్టీ లో నయానో, భయానో తమవైపు తిప్పుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది . దేశ వ్యాప్తంగా ఈ ఫిరాయింపు పర్వం కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఇది గతంలో శృతిమించింది .


అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన  జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పి , ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచారు. జగన్ స్ఫూర్తిని ఇతర పార్టీలు కూడా కొనసాగించి , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నారాయణమూర్తి లాంటి ప్రజానటులు కోరుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: