నిత్యం వాహనాల వేగంతో జరిగే ఎన్నో సంఘటనలు మనం చూస్తునే ఉన్నాం... వీటికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, అతివేగం. అతివేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్​గన్​తో గుర్తించి చలానాలు వేస్తున్నా వేగం తగ్గడం లేదు. ప్రమాదాలు ఆగడం లేదు. ఈ కారణాలతో ప్రాణాలు పోయేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే  ప్రమాదాలకు కారణమైన వేగాన్ని తగ్గించడమే అంతిమ నిర్ణయం. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలకు పదును పెట్టే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.

అత్యధిక ప్రమాదాలకు కారణమైన భారీ వాహనాల వేగానికి కళ్లెం వేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్​ చట్టాలను కచ్చితంగా పాటించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాహనాలకు వేగ నిరోధక పరికరం బిగించడానికి ఆగస్టు 1 తుది గడువు విధించింది. నిరోధక పరికరం ఉంటేనే వాహనం రోడ్డుపై తిరిగేందుకు వెసులుబాటు ఉంది. లేకుంటే ఫైన్‌‌‌‌లు విధించడం ఉంటాయి. వాహనాల వేగాన్ని అదుపులోకి తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

వాహనాల అతి వేగంతో ప్రమాదాలు చోటు చేసుకోవడం, కొందరు పోలీసు అధికారులు మరణించడం, పలు చోట్ల వాహనాలు దెబ్బతినడం వంటి ఘటనలతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాచకొండ పరిధిలోని పెట్రోలింగ్​ వాహనాల గరిష్ట వేగం గంటకు 60  కిలోమీటర్లుగా గతంలోనే కుదించారు. అందుకు తగ్గట్లుగా ప్రతి వాహనానికి స్పీడ్ లాక్ కొద్ది నెలల క్రితమే అమర్చారు.

వాహనాలు, స్కూల్ బస్సులు, ట్రాన్స్​పోర్టువాహనాలకు స్పీడ్ లిమిటింగ్ డివైస్ లనుతప్పనిసరిగా బిగించుకోవాలి. ఆగస్టు 1వతేదీలోపు వాటిని అమర్చుకోకుంటే తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ద్రువీకరించిన, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఏజెంట్ల నుంచి మాత్రమే ఈ పరికరాలను కొనాలి. నూతన వాహనాలకు కంపెనీలే స్పీడ్ లిమిట్ పరికరాలను బిగించి ఇస్తాయి. కొత్తవాహనాల పరికరం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు . ఇందులో ద్విచక్ర వాహనాలు,ఆటోలను మినహాయిం చినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: