బీజేపీకి కేంద్రంలో మంచి మెజారిటీ రావడం కాదు కానీ ఏపీలో రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది. నెల తిరక్కుండానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేసుకున్న బీజేపీ ఇపుడు పక్క చూపులు చూస్తోంది.


తన వెనక 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్న బీజేపీ అంతటితో ఆగడంలేదు, టీడీపీకి చెందిన మాజీ నాయకులని, బలమైన నాయకులను చేర్చుకోవాలనుకుంటోంది. ఇక జనసేనతో పాటు, వైసీపీకి కూడా కన్ను కొడుతోంది. 


తాజాగా వైసీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ప్రధాని మోడీని కలిసారు. ఒక్కరే కాదు కుటుంబ సమేతంగా కలిసారు. మోడీతో మంతనాలు జరిపారు. ఇదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. మరి మోడీతో ఎందుకు భేటీ వేశారు అన్నది రెండు పార్టీలలోనూ చర్చగా ఉంది. 


నిజానికి రఘురామక్రిష్ణం రాజు వైసీపీ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి వైసీపీకి మారిన నాయకుడు. ఆయనకు అధికార పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయన్నది తెలిసిందే. ఇది అంతటికే పరిమితం అవుతుందా పూర్వ పరిచయాలతో ఇంకాస్తా ముందుకు  అన్నది కూడా ఆసక్తిగా ఉంది. మరి బీజేపీ నాయకులేమో తమతో వైసీపీకి చెందిన పెద్ద నాయకులు కూడా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. మరి ఇది బోణీ అవుతుందా లేక ఉత్తిత్తి న్యూస్ గా తుస్సుమంటుందా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: