చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవం ఎక్కువే కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం విమర్శల పాలవుతోంది. హుందాగా ఉంటానని తరచూ చెప్పే చంద్రబాబు తాను మాత్రం దాన్ని అసలు పాటించరు. బురద జల్లడంతో ముందుండే  బాబు నీతులు మాత్రం చాలానే చెబుతారు.


ముదిమి వయసులో పడిన బాబుకు తెలుగు ప్రజలు ఎంతో ఇచ్చారు. పార్టీ పెట్టిన అన్న నందమూరి ఎనిమిదేళ్ళ పాటే సీఎం గా ఉంటే బాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ పాటు ఉన్నారు. ఇక గ్లామర్ లో కానీ ప్రజాదరణలో కానీ అన్న నందమూరితో కానీ, వైఎస్సార్ తో కానీ ఎక్కడా పోటీ పడలేని బాబు సీఎం గా వారి కంటే ఎక్కువ కాలం పనిచేశారంటే అది ఏపీ ప్రజల చలవే.


ఆ సంగతి మరచి నేనేం తప్పు చేశాను నాకు 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చారని బాబు ఓట్లేసిన జనాన్నే ఆడిపోసుకోవడం ఏ విధమైన హుందా రాజకీయమో ఆయనే చెప్పాలి. పదేళ్ళ పోరాటం తరువాత జగన్ కి ఒక చాన్స్ ఇద్దామని గెలిపిస్తే దాన్ని కూడా  బాబు ఒర్వలేకున్నారు. జగన్ సీఎం అయి గట్టిగా నెల రోజులు కూడా కాలేదు నిందలు వేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు.


కనీసం కొత్తం ప్రభుత్వానికి కొన్నాళ్ళు టైం ఇద్దామన్న ఆలోచన కూడా బాబుకు లేకుండా పోయింది. అపుడే జగన్ ఫెయిల్ అయిపోయాడు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అంటున్నాడు చంద్రబాబు. ఈ వైఖరి చూస్తూంటే బాబు అక్కసు ఏ రేంజిలో ఉందో అర్ధమవుతోంది.


ప్రజాస్వామ్యం ఇది. బాబు మాత్రమే కాదు జగన్ కూడా సీఎం కావచ్చు. ఆ మాటకు వస్తే ఏపీలోని అయిదు కోట్ల మందిలో ఎవరైనా కావచ్చు. ప్రజాస్వామ్యం దయతో మూడు మార్లు సీఎం అయిన చంద్రబాబు అదే ప్రజలను తప్పు పట్టడం, తన తప్పు ఏమీ లేదని చెప్పుకోవడం దారుణమే. జగన్ని పనిచేయనివ్వాలి. ప్రతిపక్షంలో కూర్చుని సలహాలు ఇవ్వాలి. అదీ హుందా రాజకీయం అంటే


అంతే తప్ప తగుదునమ్మా అని అందరినీ చుట్టూ పిలిపించుకుని నీవెందుకు ఓడావయ్యా అంటూ ఓదార్పు కార్యక్రమాలు పెట్టించుకుంటే తమ్ముళ్ళు కూడా నమ్మరు. బాబు మాత్రం ఇలాంటి రాజకీయాలకే తెర తీస్తున్నారు. మరి ఆయన నాయకత్వ్తంలో టీడీపీ ఇలాగైతే ఇబ్బందులో పడినట్లే. ఒక్క నెల రోజులకే కుర్చీ యావతో పెడబొబ్బలు పెడుతున్న బాబు అయిదేళ్ళు జగన్ని తిన్నగా సీట్లో కూర్చోనిచ్చేట్లు లేదన్నది మాత్రం పచ్చి నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: