ప్రఖ్యాత కంపెనీలో ఐటీ దాడుల కలకలం..? అవును, ఇది ఈ రోజు హైదరాబాద్‌ బిజినెస్‌ సర్కిల్లో ఒక సంచలన వార్త. తెలంగాణ లో కీలక నేతకు అతి సన్నిహిత మిత్రుడికి చెందిన ప్రఖ్యాత రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై గురువారం పెద్ద ఎత్తున ఐటీ దాడులు.. జరగడంతో వ్యాపార, రాజకీయ వర్గాల్లో కలకలం.. మొదలైంది !!

గత రెండు దశాబ్దాలుగా దశ తిరిగి, ఇటీవల ఉజ్వల దశలో ఉన్న ఆ సంస్ధ పై ఐటీ కన్ను పడింది. నెంబర్‌ వన్‌ స్ధానంలో ఉన్న మీడియాను కొనుగోలు చేసి, వివాదాల్లో చిక్కుకున్న ఆ సంస్ధ ,తాజాగా మరి రెండు ఛానెల్స్‌ని కొనడానికి చర్చలు జరుపుతున్నట్టు పొలిటికల్‌, బ్యూరోక్రటిక్‌, ప్రెస్‌ సర్కిళ్లలో ఉన్న ఓ ప్రచారం.

గురువారం ఉదయం నుంచీ ఆ సంస్థలపై, ఇళ్లపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతుండటం.. ఒక సంచలనం. అయితే రొటీన్‌గా ఐటీ శాఖ చేసిన దాడుల్లాంటివేనా..? చివరకు కొండను తవ్వి ఏదైనా ఎలుకను చూపిస్తారా..? సోదాల్లో దాదాపు 100 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు. పలు పత్రాలను  పరిశీలిస్తున్నారు.

దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదా..? ఏవో ఉల్లంఘనలు అనుమానించి ఐటీ శాఖ కేవలం శాఖాపరంగా తీసుకున్న నిర్ణయమేనా..? అని అపుడే సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఢిల్లీ పెద్దల పచ్చజెండా ఊపనిదే ఇది జరగదని, ఐటీ దాడుల్లో ఏం పట్టుకున్నారు..? ఏం తేలింది..? ఎవరు ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవ టానికి ఐటీ శాఖ ప్రయత్నిస్తున్నది అనేది త్వరలో బయటపడొచ్చు అని రాజకీయ విశ్లేషకుల అంచనా ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: