కొంతకాలంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే.. వారు జగన్, కేసీఆర్ వేసిన వలలో పడినట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండటమే ప్రధానమంటూ ఇటీవల కేసీఆర్, జగన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తే, కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లారు.


ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన నీటి సమస్యతో పాటు విభజన సమస్యలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపారు. సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో దీన్ని రాజకీయ అస్త్రంగా టీడీపీ మలచుకునే ప్రయత్నం చేసింది.


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జగన్ భేటీ అయినప్పటి నుంచి.. కెసిఆర్ ట్రాప్ లో జగన్ పడ్డారన్న ప్రచారం మొదలు పెట్టారు. ఏపీ ప్రాజెక్టులకు కేసీఆర్ వల్ల అన్యాయం జరుగుతుందని అంటున్నారు. మరోటీడీపీ నేత ఏకంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం జగన్ పనిచేస్తున్నాడని విమర్శించారు. తెలుగుదేశం మీడియా ఏకంగా లక్ష కోట్ల ప్రాజెక్టును పరాయి గడ్డపై కట్టడానికి జగన్ ఖర్చు చేయబోతున్నారని ప్రచారం చేస్తోంది.


అయితే కేసీఆర్, జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే కాకపోయినా ఓ ఏడాది కాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎవరు ఏమిటన్నది ప్రజలకే అర్థమవుతుంది. పెద్దగా విమర్శలకు అవకాశం లేని ఇలాంటి ఇష్యూలను పట్టుకోవడం ద్వారా టీడీపీ జగన్, కేసీఆర్ ట్రాపులో పడినట్టు కనిపిస్తోంది. ఇవి కాకుండా నిజంగా ప్రజాసమస్యలపై పోరాడితే జనం అభిమానం చూరగొనే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: