ఒకప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే కుటుంబమంతా కలిసి పండగల వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు పండగలకు మాత్రమే కుటుంబంతో సినిమాకి వెళ్తున్నాం,అందుకు కారణం పెరిగిన టికెట్ ధరలు ఓ సగటు మధ్యతరగతి వ్యక్తి కుటుంబంతో సినిమాకి వెళ్లనుంటే జేబులకి చిల్లులు పడుతున్నాయి, ఇక ఇంటర్వెల్ లో థియేటర్ యాజమాన్యం బాదుడు మరొ కారణం.

రేపు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ సమావేశాల్లో సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందించనుంది, పెరుగుతున్న టికెట్ ధరలకు కళ్లెం వేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం 100కు పైన ధర ఉన్న టికెట్లకు 18%,100కు లోపు ధర ఉన్న టికెట్లకు 12% GST శ్లాబ్ ఉంది.

ఇకపై సినిమా టిక్కెట్లను ఒకే పన్ను ఉంచాలని కేంద్రం భావిస్తూ టికెట్ల పై GST ని తగ్గించనున్నారు, ఇదే జరిగితే టికెట్ల ధరలు తగ్గుతాయి.
ఇదివరకులా టికెట్ల కోసం థియేటర్ లకు వెళ్లే రోజులు కావు ఇప్పుడు ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ మీద కూడా రాయితీలు ఇవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: