ఏపీలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన టిడిపి నేతల పరిస్థితి రోజురోజుకు మానసికంగా దిగజారిపోతోంది. ఓడిపోయిన బాధలో ఉన్న టిడిపి నేతలు ఇప్పటికైనా తేరుకుని ప్రజా సమస్యలపై ఎలా ? పోరాటం చేస్తారు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురు చూస్తుంటే... ఆ పార్టీ అధినేతతో పాటు నేతలు మాత్రం ఊసుపోక‌ కబుర్లతో వైసీపీపై విమర్శలు చేస్తూ.. ఓట‌మి బాధను ఇంకా దిగమింగుకోలేక తమ అక్కసు వెల్లగక్కుతున్నారు. టిడిపి చరిత్రలోనే ఎప్పుడు లేనంత ఘోరంగా కేవలం 23 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ సీట్లతో సరిపెట్టుకుంది.


ఇక వైసిపి దెబ్బకు జాతీయ పార్టీలు ఆయన బిజెపి, కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేక పోయాయి. ప్రస్తుతం జగన్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్న తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, మేధావులు కనీసం మరో 10 సంవ‌త్స‌రాల పాటు ఆయనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని కూడా చెబుతున్నారు. ఈ మాటలు టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే చేస్తున్నాయి. 10 - 15 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు లేద‌న్న నిర్ధారణకు వచ్చిన వీరంతా వైసీపీని ఎలా బదనాం చేయాలా అన్న ఆలోచనల్లోనే జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. 


ఈ క్రమంలోనే టిడిపి నేతలు ఆ పార్టీపై నమ్మకం లేక బిజెపి, వైసీపీలోకి వెళ్లిపోతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు వైసిపి ఎంపీలు బిజెపిలోకి వెళ్లిపోతున్నారని పుకార్లకు తెర లేపుతున్నారు. వైసీపీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో తమ నియోజకవర్గ పనుల నిమిత్తం మోడీనో అమిత్ షానో కలిస్తే ఇంకేముంది అదిగో ఆ వైసీపీ ఎంపీ బిజెపిలోకి వెళ్లే పోతున్నారంటూ నీచ‌మైన ప్రచారానికి తెర లేపుతున్నారు. న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు మోడీని క‌లిసినా, అమిత్ షాను క‌లిసినా టీడీపీ వాళ్లు త‌మ సోష‌ల్ మీడియాలో ఈ ఫొటోలు పెట్టి ప్ర‌చారం చేస్తున్నారు.


రఘురామకృష్ణంరాజు మాత్రం మోడీనీ తాను మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు. ఇక ఊరూ పేరు లేద‌న్న‌ట్టుగా మ‌రో వైసీపీ ఎంపీ కూడా బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ..ఇద్ద‌రు వైసీపీ ఎంపీలో బీజేపీలోకి... క‌మ‌ళ‌ద‌ళం వైసీపీపై ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసేసింద‌న్న ప్ర‌చారానికి టీడీపీ వాళ్లు దిగ‌జారిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: