- మామూళ్ల మత్తులో అటవీశాఖ అధికారులు
శ్రీకాకుళం జిల్లాలో అక్రమ కలప వ్యాపారం సాఫీగా సాగిపోతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తూ ఒడిస్సా, ఆంధ్రా అటవీశాఖ అధికారుల అండదండలతో ఈ అక్రమ కార్యకలాపాలు సాఫీగా సాగిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. జిల్లా అటవీశాఖ అధికారులు కనీసం సామిల్లుపై కూడా నిఘా పెట్టలేకపోతున్నారని, ఇదంతా అక్రమ వ్యాపారులు సమన్వయంతోనే ఆ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


జిల్లాలో 87 సామిల్లులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో నడుస్తున్నవి మాత్రం 65. మిల్లుల నిర్వాహణలో ఎన్నో నిభందనలు పాటించాల్సి ఉంది అంతేకాకుండా భద్రతా చర్యలు కూడా చేపట్టాల్సిఉంది.  అటవీ శాఖ అనుమతి పత్రాలను సొంత వినియోగకైతే యజమాని అనుమతి పత్రాలన్నీ సక్రమంగా ఉండాలి.


ముఖ్యంగా వాల్టా చట్టానికి తూట్లు పడుతున్నాయి. వాస్తవానికి చెట్లు కొనుగోలు చేయాలంటే వాల్టా చట్టం ప్రకారం సంబంధిత రైతు అనుమతితో పాటు రెవిన్యూ అటవీశాఖధికారుల అనుమతి ఉండాలి. ఈ అనుమతులకు చెట్ల సైజును బట్టు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ కొందరు సామిల్లుల యజమానులు ఎటువంటి అనుమతులు  లేకుండా వాటిని ఇష్టరాజ్యంగా వాటిని కొనుగోలు చేస్తూ .ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు కోకొళ్లలు.


మరింత సమాచారం తెలుసుకోండి: