లోటు బ‌డ్జెట్ తో మునిగి తేలుతున్న  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి  ప్ర‌త్యేక హోదా ఎంతో అవ‌స‌రమని అనధికారికంగా బీజేపీ నాయకులు కూడా ఒప్పుకుంటారు, కానీ అధికారికంగా మాత్రం ప్రత్యేక హోదా గడిచిన అంశం అంటారు.  విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న  ప్ర‌త్యేక హోదాను అమ‌లు చేయకుండా.. తిరుమలేశుడి సాక్షిగా  ఇచ్చిన మాట‌ను కూడా తుంగ‌లో తొక్కారు మన మోదీగోరు.   పైగా తెలివిగా ఏపీకి హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా హోదా అడుగుతున్నాయ‌ని,  అందుకే హోదా బదులు ప్ర‌త్యేక రాయితీలు ఇస్తామ‌ని చెబుతున్నారు. కానీ ఏమి ఇస్తారో చెప్పరు, చెప్పినా  అదీ ఇవ్వరు.
   

ఇలాంటి పరిస్థితుల్లో త‌మ‌కు  25 ఎంపీల‌ను ఇస్తే హోదా  సాధించి తీరుతామ‌ని  వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దాంతో ఏపీ ప్ర‌జ‌లు వైసీపీకి 23 మంది ఎంపీల‌ను గెలిపించారు. కానీ  మోదీ స‌ర్కార్ కు  ఏపీ ఎంపీలతో అవ‌స‌రం లేకుండా పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హోదా సాధించగలడా.. ? ఖ‌చ్చితంగా  అది క‌ష్ట‌మైన ప‌నే.  హోదా రావాలంటే  నిబంధ‌న‌ల ప్ర‌కారం హోదా అర్హతకి తగ్గట్లు  ఏపీలో ప్ర‌తికూల ప‌రిస్ధితులు ఉండాలి. అన్నిటికీ మించి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఇత‌ర రాష్ట్రాలు  అంగీకరించాలి. అలా అంగీకరికంచేలా రాజకీయాలు చెయ్యాలి.  


వీటితో పాటు పార్టీల‌కు అతీతంగా ఏపీలో అధికార‌,ప్ర‌తిప‌క్ష పార్టీలు కలిసి కేంద్రం పై తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకువచ్చి.. బీజేపీ పై రాజకీయ యుద్ధం చేయగలిగితే  హోదా రావొచ్చు. గతంలో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌రిగిన పోరులో మొదట  కేవ‌లం ఇద్ద‌రు ఎంపీల(తెరాస పార్టీకి చెందిన వారు) రాజీనామాల‌తోనే  తీవ్ర రూపం దాల్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్రత్యేకహోదా కూడా అలాంటి పరిస్థితులను కల్పిస్తేనే మోదీ మనసు మారుతుంది.  జగన్ హోదా అనే  ఒక్క దాని సాధిస్తే.. మరో పాతికేళ్లు జగనే సీఎం. ఎలాగూ వయసు రీత్యా బాబుకి  వచ్చే ఎన్నికలే చివరివి, టీడీపీకి ఇక నాయకుడు ఉండదు, జనసేనకి నాయకుడు ఉన్నా, సేన నిలవదు. ఈ పరిణామాల్ని గమనిస్తే.. మరో పాతికేళ్ళు జగనే సీఎం.       


మరింత సమాచారం తెలుసుకోండి: