మొత్తానికి టిడిపి నుండి వైసిపిలోకి వలసలు మొదలైనట్లే ఉంది. ఏలూరులో అంబికా రాజా టిడిపికి గుడ్ బై చెప్పేసి వైసిపిలో చేరటం నిజంగా చంద్రబాబుకు పెద్ద షాకనే చెప్పాలి.  సంవత్సరాలుగా టిడిపిలోనే ఉన్న అంబికా సోదరుల్లో అంబికా రాజా టిడిపికి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి గుడ్ బై చెప్పటమే కాకుండా ఏకంగా వైసిపిలో చేరిపోయారు. ఈమధ్యనే అంబికా కృష్ణ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

 

అంబికా సోదరులు చాలా సంవత్సరాలుగా టిడిపిలోనే ఉన్నారు. కృష్ణ టిడిపి తరపున ఒకసారి ఏలూరు ఎంఎల్ఏగా గెలిచారు. అంతేకాకుండా మొన్నటి వరకూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. సినిమా నిర్మాత కూడా కావటంతో అంబికా ఫ్యామిలికి సినిమా పరిచాయాలు బాగానే ఉన్నాయి.

 

వైశ్య సామాజిక వర్గానికి చెందిన అంబికా ఫ్యామిలికి  సామిజికవర్గంలో బాగా పట్టుంది. అంతేకాకుండా అంబికా బ్రాండ్ క్రింద ఏలూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని సమక్షంలో రాజా వైసిపిలో చేరటం గమనార్హం.

 

నిజానికి వైసిపిలో చేరటానికి టిడిపి ఎంఎల్ఏలతో పాటు నేతలు చాలామంది రెడీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే జగన్మోహన్ రెడ్డే ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు. ఎంఎల్ఏల విషయాన్ని పక్కనపెట్టేస్తే నేతలు నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఇప్పటికే చాలామంది టిడిపి నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నా వైసిపిలో చేరింది మాత్రం రాజానే మొదటి నేత.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: