మాట తప్పని, మడమ తిప్పని నాయకుడినని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచే జ‌గ‌న్ ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. పాద‌యాత్ర‌లో ఏపీ ప్ర‌జ‌లు ఎదుర్కొంటోన్న ఎన్నో ఇబ్బందుల‌ను స్వ‌యంగా చూసిన జ‌గ‌న్‌, మ‌రెంద‌రో ప‌డుతోన్న బాధ‌ల‌పై విన‌తిప‌త్రాలు కూడా స్వీక‌రించారు.


ఈ క్ర‌మంలోనే సీఎం అయిన‌ప్ప‌టి నుంచి తాను ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే కష్టాలలో ఉన్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆక్వా రంగంలో వాడే విద్యుత్‌కు యూనిట్‌కు రూ 1.50 చేసి అక్వాకు ఊత‌మిచ్చారు. న‌ష్టాల్లో ఉన్న అక్వాకు ఈ త‌గ్గింపు పెద్ద ఉప‌శ‌మ‌నం లాంటిది. 


జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ల‌క్ష‌లాది ఎక‌రాల్లో అక్వా రంంలో ఉన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు కొనసాగుతోంది. ఇక తూర్పులో కోన‌సీమ‌లో కూడా భారీ ఎత్తున అక్వా సాగు జ‌రుగుతోంది. కృష్ణాలో ఉన్న కొల్లేరులోనూ భారీగా చేప‌ల చెరువులు ఉన్నాయి. రొయ్యల చెరువులకు ప్రధానంగా విద్యుత్‌ అవసరం. 


ఇప్ప‌టి వ‌ర‌కు క‌రెంటు బిల్లులు యూనిట్‌కు రూ.3.86 చెల్లించేవారు. ఇంత బిల్లు చెల్లించినా విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా అంత‌త మాత్రంగానే ఉండేది. దీంతో రైతులు డీజిల్‌పై ఆధార‌ప‌డేవారు. ఈ ఖ‌ర్చులు త‌డిసి మోపెడు అయ్యేవి. ఇప్పుడు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో క‌రెంటు చార్జీలు త‌గ్గిస్తాన‌ని ఇచ్చిన హామీతో అక్వా రైతులు భారీగా లాభ‌ప‌డ‌డంతో పాటు అక్వాకు మ‌రింత ఊతం రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: