ఇప్పుడు ఏపీ రాజకీయాలు విత్తనాలు చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం విత్తనాల డబ్బును వాడేశారని వైసీపీ ఆరోపిస్తుంది. సాధారణంగా విత్తన సరఫరా జూన్-జూలై లలో సాగుతుంది. అయితే ఖరీఫ్ కు విత్తన సేకరణ మాత్రం ఫిబ్రవరి - మార్చి నెలల్లోనే సాగుతుంది. అప్పుడు సేకరిస్తేనే ఇప్పుడు పంపకానికి అవకాశం ఉంటుంది.


ఫిబ్రవరి సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పూర్తి అధికారాలు కలిగి ఉన్నారు. అప్పుడు విత్తన సేకరణ చేయడానికి నిధుల కేటాయింపు సరిగా జరగలేదని ఇప్పుడు ప్రభుత్వం అంటోంది. అప్పుడు అందుకు సంబంధించిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టించారని..వాటిని కూడా ఎన్నికల ముందు పంచిన డబ్బుకు వాడారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు స్పందించారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది ప్రజలు నమ్మరని బాబు చెప్పుకొచ్చారు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాజికల్ గా మాట్లాడుతూ ఉంది. విత్తన సేకరణ అనేది అప్పుడే జరగాల్సిన పని అని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వాదన ను ప్రజలు నమ్మడం లేదని తేల్చారు. అయినా ఇటీవలే  ఎన్నికలు అయ్యాయి.. ఎవరి వాదనను ప్రజలు నమ్మారో అందరికీ తెలిసిన సంగతేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: