ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎంత వేగంగా మారుతున్నాయి అంటే అంత వేగంగా మారిపోతున్నాయి.  జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతుంటే.. తెలుగుదేశం పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది.  


కనీసం పార్టీకి చెందిన నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.  పార్టీ నేతలను, కార్యకర్తలను వేరే పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం ఆపరేషన్ కమల్ ను ఏపి లో అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నది.  


తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే నేతలకు స్వగతం పలుకుతున్న బీజేపీ, ద్వితీయశ్రేణి నాయకులతో పాటు బడానాయకులను కూడా ఆహ్వానించేందుకు సిద్ధం అవుతున్నది.  తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  


తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.  వచ్చేందుకు అనుమతిస్తూనే.. రాజీనామా చేయాలని కండిషన్స్ పెట్టడంతో.. ఒకటికి రెండు సార్లు నేతలు ఆలోచనలో పడ్డారు.  కొంతమంది అందుకు సిద్దపడి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: