జగన్ సర్కార్ అభివ్రుధ్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సీనియర్లు, చురుకైన మంత్రుల టీం ని ఎంచుకుంది. పదమూడు జిల్లాలకు వారిని నియమించింది.  పదమూడు జిల్లాలకు పదమూడు మందిని నియమించారు. ఇకపై వీరి  నాయకత్వంలో జిల్లా ప్రగతి రధం పరుగులు తీస్తుంది.


ఇందులో వరసగా చూసుకుంటే  శ్రీకాకుళం జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లాకు రంగనాధరాజు, విశాఖపట్నానికి మోపిదేవి వెంకటరమణ, తూర్పు గోదావరికి ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాకు పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లాకు కె.కన్నబాబు, గుంటూరు జిల్లాకు పేర్నినాని , ప్రకాశం జిల్లాకు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు సుచరిత, చిత్తూరు జిల్లాకు మేకపాటి గౌతం రెడ్డి, కడపకు బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, కర్నూలు జిల్లాకు బొత్స సత్యనారాయణ,అనంతపురానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ చార్జీ మంత్రులుగా వ్యవహరిస్తారు. జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.


ఇదిలా ఉండగా మొత్తం మంత్రులు పాతిక మంది ఉంటే పదమూడు మందికే అవకాశం దక్కింది. దాంతో వీరే జిల్లాల్లో కీలకం కానున్నారు. ఇక మిగిలిన వారు తమ శాఖలను చూసుకుంటారన్న మాట. ఈ ఇంచార్జి మంత్రులకు ఓ అవకాశం ఉంది. వారే జిల్లా నిధులను సక్రమంగా ఖర్చు చేయిస్తారు. స్వాతంత్ర దినోత్సవం వేళ జెండా ఎగురవేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: