ఏపీ మాజీ మంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా సంచలన ప్రకటన చేసాడు. ఏపీ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు స్పందిస్తూ నారా లోకేష్ ట్విట్ చేశారు. ఆ ట్విట్ లో వైసీపీ వర్గీయులు, కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలను బెదిరించిన, దాడి చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టిన ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యండి అంటూ నెంబర్ ఇచ్చారు. 


టీడీపీ ప్ర‌త్యేక విభాగం నెంబ‌ర్‌ 7306299999 కి ఫోన్ చేసి సమాచారం అందించండి అని, పార్టీపరంగా కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు అన్నివిధాలా స‌హాయం అందిస్తాం అని, దీనికోసం ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులను రక్షించుకోవడం మా బాధ్యత అంటూ లోకేష్ ట్విట్ పెట్టాడు.


తెదేపా కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై న్యాయపోరాటం చేసేందుకు తెలుగుదేశం ఒక ప్రత్యేక న్యాయవిభాగాన్ని ఏర్పాటుచేసింది. అంతేకాదు పార్టీపై దుష్ప్రచారం చేస్తూ, పార్టీ నేతలపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం https://www.facebook.com/tdpsocialmedialegalcell … పేరిట ఒక ఫేస్ బుక్ పేజీని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎటువంటి అభ్యంతరకర పోస్టులు మీ దృష్టికి వచ్చినా, ఈ పేజీ వేదికగా మాతో పంచుకోండి. సదరు వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేద్దాం'' అంటూ ట్విట్ చేసారు. అయితే ఈ ప్లాన్ సరిగ్గా పని చేస్తుందా ? లేక చంద్రన్న స్కీమ్స్ లా కొట్టుకుపోతుందా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: