అమీర్‌పేట్ అంటేనే..ఐటీ కోచింగ్ సెంట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. తెలుగు రాష్ట్రాల్లోని వారే కాకుండా..దేశ‌వ్యాప్తంగా ఉన్న వారు కూడా ఇక్క‌డికి వ‌చ్చి శిక్ష‌ణ పొందుతుంటారు. అయితే,తాజాగా అమీర్‌పేట మైత్రివనంలో గల 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు.అగ్నిమాపక నిబంధనలు పాటించే విష‌యంలో గ‌తంలో చేసిన తనిఖీల సందర్భంగా గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు తాజాగా రైడ్‌ చేసి సీజ్‌ చేశారు. దీంతో అమీర్‌పేట్ కోచింగ్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు పాటిస్తేనే...ఈ సెంట‌ర్ల మ‌నుగ‌డ కొన‌సాగ‌నుంది.


గతంలో సూరత్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 23మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే రెండు నెలల కిందట నగరంలోని అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌లోని 671 కోచింగ్‌ సెంటర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న వాటిలో 170 కోచింగ్‌ సెంటర్లు తాము అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఇతర రక్షణ చర్యలు తీసుకుంటామని.. అందుకోసం కొంత గడువు ఇవ్వాలని కోరాయి. ఈ 170 కోచింగ్‌ సెంటర్లను అధికారులు మినహాయించారు.


తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు  హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న పలు ఐటీ శిక్షణా కేంద్రాలపై  తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అగ్నిమాపక నిబంధనలు పాటించని 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. తనిఖీల సందర్భంగా గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు తాజాగా రైడ్‌ చేసి సీజ్‌ చేశామ‌ని అధికారులు తెలిపారు. ఇకపైనా దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు. తాఖీదులు జారీచేసినప్పటికీ ఇంకా స్పందించని.. ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేసిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తామ‌ని తేల్చిచెప్పారు. 
 కోచింగ్‌ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రైడ్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా


మరింత సమాచారం తెలుసుకోండి: