ఒక చిన్న పొరపాటు ఏడాదిగా గ్రహపాటుగా మారింది. అది పాలకొండ పట్టణ ప్రజలకు తీరని అగచాట్లకు దారితీసింది. ఎక్కడైనా ఒకే సర్వే  నెంబరుతో ప్రైవేటు, ప్రభుత్వ భూములు ఉంటాయా.. పాలకొండలో అలా ఉన్నాయి. దాంతో అదిగమనించిన అధికారులు ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తున్నారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేయటంతో అన్ని వర్గాల వారు ఇక్కడ ఇక్కట్లు పడుతున్నారు. 


దీనికితోడు శాఖల మధ్య సమన్వలోపంతో చిన్న సమస్య పరిష్కారానికి ఏళ్ల పాటు సమయం పడుతోంది. సుమారు రెండేళ్ల కిందట సర్వే నెంబరు నిషేదిత జాబితాలోకి చేరింది. అప్పటి నుంచి అధికారులు సమస్య పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం శాపంగా మారింది.


పాలకొండ పట్టణం సర్వే నెంబరు 479(1) లో ఉంది. ఈ సర్వే నెంబరులోనే 201.59 ఏకారాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. ప్రతిఏటా రెవిన్యూ అధికారులు రెజిస్ట్రేషన్కు ప్రభుత్వ భూముల జాబితాలను అందిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఒకే సర్వే నెంబర్తో ఉండడంతో సమస్య ఎదురైంది. ప్రభుత్వ భూములుగా సర్వే నెంబర్ లో 479(1) ఇవ్వడంతో అప్పటి నుంచి పట్టణంలో రిజిస్ట్రేషన్ పనులు నిలిచిపోయాయి.


ఉన్నతాధికారుల ఆదేశాల  మేరకు  స్థానిక రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల జాబితాలను సిద్ధంచేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక సర్వే నెంబర్లు కేటాయించారు. సర్వే లో లోపాలను సరిచేసి తిరిగి ఉన్నతాధికారులకు దస్త్రాలను పంపారు. అధికారులు తిరిగి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. 


పట్టణాలలో ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించిన అధికారులు పలు దేవాలయాల భూములను సబ్ డివిజన్ చెయ్యలేదని కలెక్టర్ నుంచి ఇటీవలే స్తానిక తహసీల్దార్ లకు ఆదేశాలు అందాయి. పట్టణ పరిధిలోని సర్వే నెంబర్ 479(1) గత ఏడాదిన్నరగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: