ఇకపై ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయం

 

•  ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశం

 

•  అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం

 

•  సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం 

 

•  ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు

 

•  ఇసుకరీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు

 

•  రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు

 

•  స్టాక్‌యార్డునుంచి వినియోగదారుడుకు చేరేంతవరకూ మరొక రశీదు

 

•  స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, ఇసుక బయటకు వెళ్లేటప్పుడుకూడా  వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు

 

•  రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు

 

•  ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి

 

•  మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు 

 

•  ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు  - వీరిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశం

 

•  రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, వాటికి జీపీఎస్‌ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డుల ఏర్పాటు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి 

 

•  ఇసుక వినియోగ దారులకోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను తయారుచేయనున్న ఏపీఎండీసీ

 

•  కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కొనసాగించనున్న కలెక్టర్లు

 

•  రెండునెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అందించనున్న ఎన్‌ఎండీసీ

 

•  ప్రభుత్వానికి, వినియోగదారుడుకు పరస్పరం మేలు జరిగేలా ధరను నిర్ణయించనున్న గనులశాఖ

 

•  కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను ఏర్పాటు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి: