పోలీస్‌ నిఘాతో గంజాయి రవాణా కష్టభరితంగా మారుతున్న తరుణంలో గంజాయిముఠాలు విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి నిర్థారనైంది. అభం శుభం తెలియని విధ్యార్థుల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి తెలియకుండా ఈ రొంపిలోనికి దించుతున్నారు. గంజాయి రవాణాలోనూ, మార్కెటింగ్‌లోనూ వారిని సాంతం వాడేస్తున్న వైనం వెలుగులోనికి వచ్చింది. 


 విశాఖ నుంచి భువనేశ్వర్ కు భారీ ఎత్తున గంజాయి తరలిస్తూ పలాస వద్ద నలుగురు విధ్యార్ధులు మఫ్టిలో ఉన్న పోలీసులకు పట్టుబడ్డ వైనం సంచలనం సృష్టించింది. స్పెషల్ బ్రాంచుకు  వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి రాష్ట్రం భువనేశ్వర్ కు రెండు కార్లలో తరలిస్తున్న సుమారు 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


 రెండు కార్లు గేట్ వద్దకి వచ్చే సరికి మఫ్టీలో వున్న కాశీబుగ్గ పోలీసులు కారులో ఉన్న నలుగురు యువకులను, రెండు కార్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.21 లక్షల వరకు ఉంటుందని అంచన. ఈ ఘటనా స్థలానికి  SI మహమద్ ఆలీ చేరుకొని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు. గంజాయిని 173 పాకెట్స్ గా కట్టి వాటిని ఒడిశా తరాలిదిస్తున్నారని  CI వేణుగోపాలరావు తెలిపారు. వసతి గృహాల్లో ఉంటున్న కొంతమంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: