అన్నీ తానై జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి క్యాబినెట్ హోదా రద్దు చేస్తు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏపి ప్రభుత్వం తరపున ఢిల్లీలో విజయసాయి ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తారంటూ ఆమధ్య జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతినిధి కాబట్టి క్యాబినెట్ ర్యాంకు కూడా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

అయితే విచిత్రమేమిటంటే ఉత్తర్వులు వచ్చిన  15 రోజుల్లోనే సదరు నియామకాన్ని రద్దు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ మేరకు చీఫ్ సెక్రటరీ నియామకాన్ని రద్దు చేస్తు మరో జీవోను జారీ చేయటంపై  పార్టీలోను బయట సర్వత్రా చర్చ జరుగుతోంది.

 

ఇంతకీ రద్దు నిర్ణయాన్ని జగన్ ఎందుకు తీసుకున్నారంటే ఓ ఎంపి లాభదాయక పదవిలో కొనసాగేందుకు లేదన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నిబంధన. ఇదే విషయంలో గతంలో కూడా సోనియా గాంధి,  బుట్టారేణుక, కొత్తా గీత లాంటి వాళ్ళపై చాలా వివాదాలు రేగాయి. కొందరు ఎంపిలపై అనర్హత వేటు కూడా పడింది.

 

ఇప్పుడు కూడా అటువంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టే విజయసాయి నియామకాన్ని రద్దు చేస్తు జనగ్ నిర్ణయించారు. కాకపోతే ఈ ఆలోచనేదో నియామకం ముందే చేసుంటే బాగుండేది.  ముందు నియమించి తర్వాత రద్దు చేస్తే జనాల్లోకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: