చినబాబు లోకేశ్ ఈ మధ్య స్పీడు పెంచుతున్నాడు. ఐదేళ్లుగా లేని స్పీడు వారం రోజులుగా కనపడుతోంది. ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసినా సీరీయస్ పొలిటీషియన్ అనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీపై పెద్దగా విరుచుకుపడింది లేదు. కానీ.. ప్రతిపక్షంలోకి వచ్చాక గత వారం రోజులుగా ప్రభుత్వంపై ట్వీట్స్ తో విరుచుకుపడుతున్నాడు.


“మీ బాబు, మా బాబుని..” అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ తో కొంత అటెన్షన్ తీసుకొచ్చాడు. మీడియాలో హైలైట్ అయ్యేసరికి ట్వీట్స్ లో వేగం పెంచాడు. దీంతో వైసీపీ వాళ్లు లోకేశ్ ను ఆడుకుంటున్నారు. “చినబాబూ..! నువ్వు మాట్లాడితే తప్పలు వస్తాయని, వేరే వారి చేత రాయించి నువ్వు పోస్ట్ చేస్తున్నావా..” అంటూ సెటైర్లు వేస్తున్నారు. లోకేశ్ ట్వీట్లను వైసీపీ సీరియస్ గా తీసుకుంటున్నట్టు లేదు. ప్రభుత్వంపై ఆరు నెలల వరకూ అవసరం లేదు, ఎటాకింగ్ మొదలుపెట్టండి అంటూ నేతలకు సూచిస్తున్నాడు. ప్రభుత్వంపై ముందే ఎటాకింగ్ కి వెళ్లి ప్రజలను తనవైపుకు తిప్పుకోవడానికే ఈ ట్వీట్లు చేస్తున్నాడనే అనుమానమూ రాకపోదు. ఏదైతేనేం.. ఈ ఐదేళ్ల టైమ్ లో రాజకీయం నేర్చుకుందామని ఫిక్స్ అయినట్టున్నాడు. మంచిదే!

 

కానీ.. లోకేశ్ ను జనం నమ్మాలంటే ప్రూవ్ చేసుకోవల్సింది చాలా ఉంది. ప్రజల్లోకి వెళ్లాలంటే ట్వీట్లతో కాదు మాటతో వెళ్లాలి. అధినేత కొడుకు కాబట్టి పార్టీలో లోకేశ్ చేష్టలకు ఎదురుండదు. ప్రజలతో అలా కుదరదు. కానీ.. లోకేశ్ సోషల్ మీడియానే నమ్ముకున్నాడు. బాకా ఊదే మీడియా ఎలానూ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. పవన్ కల్యాణ్ ట్వీట్లతో నాలుగేళ్లపాటు పార్టీని నడిపితే విమర్శించారు. ట్వీట్లతో కాదు జనంలోకి రావాలన్నారు. వచ్చాక గళమెత్తాడు, తన పరిజ్ఞానమేంటో తెలియజేశాడు. లోకేశ్ చేయాల్సింది కూడా అదే. మాట్లాడాలి. తానేంటో అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడే జనం గుండెల్లో నాయకుడవుతాడు. ఇలా ట్వీట్లతో కాలం గడిపితే.. ప్రజలు ఈ సారి తండ్రి చాటు కొడుకుగా కాదు.. పార్టీ చాటు బిడ్డగా చూసే అవకాశం ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: