జగన్ ఎపుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి టీడీపీ ఆయన్ని ఓ ఆట ఆడుకుంది. పదేళ్ళ రాజకీయ ప్రస్తానంలో జగన్ పడ్డ నిందలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన్ని టీడీపీ ఎలా అన్నా కూడా జనంలోనే ఉంటూ తానేంటో జగన్ రుజువు చేసుకున్నారు..


ఇదిలా ఉండగా జగన్ని విద్వంస‌కారుడుగా టీడీపీ కొత్త  పేరు పెట్టింది. ఆయన సీఎం అయ్యాక ఒక ఇటుక కూడా వేయలేదట. అన్నీ కూల్చుడు పనులేనని మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు అంటున్నారు. పాలన అంటే కూల్చడాలు కాదు, నిలబెట్టేది అంటూ నీతి కధలు చెబుతున్నారు. ప్రజవేదిక కూల్చడంతో టీడీపీకి పీకల లోతు కోపం ఉంది.


ఇక టీడీపీకి ఇపుడు కొత్త గొంతు ఒకటి కలిసింది. అదే వీ హనుమంతరావు. ఆయన తెలంగాణా కాంగ్రెస్ నేత. ఏపీలో వ్యవహారాలతో ఆయనకు ఏం పనో కానీ జగన్ మీద బాణాలు వేస్తున్నారు. ఫ్రెండ్ కొడుకు సీఎం అయినందుకు గ్రీట్ చేయలేకపొయారు కానీ, తిట్టడానికి మాత్రం తయారు అంటున్నారు. 


విశాఖలో రాజీవ్ స్మ్రుతి వనం కూలగొడుతున్నాడు జగన్ అంటూ గగ్గోలు పెడుతున్నాడు వీహెచ్ నిజానికి అక్కడ కూలగొట్టడాలు ఏమీ లేవు కానీ వీహెచ్ ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. కూల్చుడు సీఎం అంటున్నారు. మొత్తానికి జగన్ రౌడీ, ఫ్రాక్షనిస్ట్ అన్నవి పోయాయి. డిమాలిషన్ మ్యాన్ అన్న పేరు కొత్తగా టీడీపీ పెట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: