కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు . బడ్జెట్ కోసం  దేశ ప్రజలంతా  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఎన్డీఏ ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెటే కాకుండా ,  వృద్ధిరేటు గణనీయంగా పడిపోయిన ప్రస్తుత తరుణం లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో నిర్మలాసీతారామన్. వృద్ధి రేటును పరుగులు పెట్టించాడు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారన్నదిహాట్ టాఫిక్ గా  మారింది . ప్రస్తుతం దేశ వృద్ధి రేటు 5. 8 కాగా, ఈ వృద్ధిరేటును పరుగులు పెట్టించాలంటే రాయితీలు , ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరముందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు .

 

దేశం లో  ఎక్కువగా పన్ను కడుతున్న వారిని  , క్రమబద్ధంగా పన్ను  కడుతున్న వారికీ, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం  ఆర్ధికమంత్రి  ఒక బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది . పన్ను సక్రమంగా చెల్లించేవారికి ఇప్పటికే ఆదాయపన్ను శాఖ ప్రోత్సహక సరిఫికెట్లను అందజేస్తోంది .  ఎక్కువ పన్ను చెల్లిస్తున్నవారికి ప్రధాని మోడీ తో కలిసి చాయ్ తాగే అవకాశం కల్పిస్తామని ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం . దీనిద్వారా పన్ను ఎక్కువగా చెల్లించేవారిని మరింతగా ప్రోత్సహించినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది . మోడీ తో చాయ్ తాగడం కోసమైన, మరింతమంది ఎక్కువగా పన్ను చెల్లించే అవకాశముంటుందని ఆదాయపన్ను శాఖ అంచనా వేస్తోంది . 


బడ్జెట్ లో వ్యవసాయరంగానికి నిర్మలాసీతారామన్  ఎటువంటి ప్రోత్సాహాన్ని ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది . దేశవ్యాప్తంగా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . యూ పి ఏ -2 ప్రభుత్వ హయాం లో 4. 7 శాతంగా ఉన్న వ్యవసాయరంగ అభివృద్ధి కాస్తా  , గత ఐదేళ్లులో మరింత  క్షిణించింది . ప్రస్తుతం 2. 8 శాతంగా ఉన్న వ్యవసాయరంగ అభివృద్ధి కొంత పుంతలు తొక్కాలంటే ప్రోత్సహాకాన్ని ప్రకటించడంతో పాటు పంటకు మద్దతు ధర గణనీయంగా పెంచాల్సిన అవసరముందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: