అసలు దయ్యాలు ఉన్నాయా.. లేవనే అంటారు శాస్త్రవేత్తలు .. కానీ.. మనలో చాలామందికి దయ్యాన్ని నేరుగా చూడకపోయినా దెయ్యంలా భ్రమపడిన అనుభవాలు ఉంటాయి. దేన్నో చూసి దెయ్యం అనుకోవడం.. ఏం జరిగినా దయ్యం కారణంగా అనుకోవడం జరుగుతుంటుంది.


కానీ.. చాలా మందికి దయ్యం వచ్చి ఛాతిపై కూర్చుంది అనే భ్రమ కలుగుతుంటుంది. ఒక్కసారిగా ఊపిరి ఆడదు.. ఏమీ మాట్లాడలేకపోతాం.. ఎవరో మనపైన కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగ్ వాస్తవమే.. మరి అలాంటప్పుడు దెయ్యం నిజమేనా..


ఎంత మాత్రం కాదు.. కానీ మరి ఎందుకు అలా అనిపిస్తుంది.. వాస్తవానికి ఊపిరి ఆడకపోవటం ఉండదు.. అలా అనిపిస్తుంది అంతే.. ఆ సమయంలో మన మెదడు లోని కొన్ని భాగాలు కొన్ని పనులు మాత్రమే చేస్తాయి.


ఇక్కడ ఓ విషయం గమనించాలి.. మన మెదడులో సెన్సారీ ఆర్గాన్స్ ను నియంత్రించే భాగం వేరు.. కదిలే ఆర్గాన్స్ ను కంట్రోల్ చేసే భాగం వేరుగా ఉంటాయి.. మనకు ఇలా ఎందుకు జరుగుతుందంటే.. సెన్సారీ ఆర్గాన్స్ భాగం మేలుకుని కదిలే ఆర్గాన్స్ ను కంట్రోల్‌ చేసే భాగం ఇంకా మేలుకోనపుడు ఇలా జరుగుతుంటుంది.


ఇంతలో.. మనకు ఏదో జరుగుతుందని భయం వేసినా.. కదలలేకపోవటంతో ఆ భయం మరింతగా పెరుగుతుంది.. అది తగినంత పెరిగినపుడు మన పూర్తి మెదడు మేలుకుంటుంది.. మనం అపుడే కదల గలుగుతాం.. అప్పటి వరకూ జరిగింది అంతా దెయ్యం కారణంగా అని నమ్ముతాం..అదీ అసలు సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: