వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రే  కాదు … మంచి మనసున్న మనిషి అని నిరూపించుకున్నారు . పదేళ్ల క్రితం ప్రమాదం లో మరణించిన ఐ ఏ ఎస్ అధికారి కూతుర్ని గుర్తుకు పెట్టుకుని ఉద్యోగాన్ని కల్పించారు . ప్రమాదాల్లో మరణించిన ప్రభుత్వోద్యోగాలు కుటుంబాలకు చెందిన వారికి అర్హతను బట్టి ఉద్యోగావకాశాన్ని కల్పించడం సర్వసాధారణమే. కానీ గత ప్రభుత్వాలు  పట్టించుకోకపోయినా , ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రమాదమృతుడు కుటుంబానికి ఉద్యోగావకాశం కల్పించి వైఎస్ జగన్ తన పెద్ద మనస్సు చాటుకున్నారు.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత రచ్చబండ కార్యక్రమానికి హెలికాఫ్టర్ వెళుతూ , పావురాలగుట్ట వద్ద ప్రమాదానికి గురై దుర్మణం చెందిన విషయం తెల్సిందే . ఆ ప్రమాదం లో  వైఎస్ తోపాటు ఆయన కార్యదర్శిగా పనిచేస్తోన్న ఐ ఏ ఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కూడా మృతి చెందారు . సుబ్రహ్మణ్యం కుటుంబం గురించి వైఎస్ మరణ అనంతరం ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి లు పట్టించుకోలేదు . విధి నిర్వహణ ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ అధికారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించి ఆదుకోవాలన్న సృహ ఆనాటి ఇద్దరు ముఖ్యమంత్రులకు లేకుండా పోయింది .


అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే  తన తండ్రి తోపాటు ప్రమాదం లో మరణించిన ఐ ఏ ఎస్ అధికారి సుబ్రహ్మణ్యం  కూతురు సింధు గ్రూప్ -1 అధికారిగా నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పట్టభద్రురాలైన సింధు ను గ్రూప్ -1 అధికారిగా నియమిస్తూ రెవెన్యూశాఖ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు . మరొకసారి తన వారికోసం జగన్  ఏమైనా చేస్తారని చేస్తారని నిరూపించుకున్నారు , 


మరింత సమాచారం తెలుసుకోండి: