ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బ‌డ్జెట్‌ ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలో ఓ పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రి తీసుకొస్తున్న తొలి పద్దు ఇదే కావడం గమనార్హం. ఈ రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రత్యేకతను మరోసారి చూపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థికమంత్రి పార్లమెంట్‌కి బయలుదేరే ముందు మనకు కనిపించే ఫస్ట్ సీన్.. మంత్రి చేతిలో ఓ లెదర్ బ్రీఫ్‌కేస్‌. బడ్జెట్‌ పత్రాలున్న ఈ బ్రీఫ్‌కేస్‌ భద్రంగా పార్లమెంట్లోకి తీసుకెళ్లి బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికమంత్రి ప్రారంభిస్తారు. కానీ.. బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు ఇవాళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్లిన నిర్మలా సీతారామన్‌.. బ్రీఫ్‌కేస్‌ ఓ రెడ్‌ కలర్‌ ఫోల్డర్‌లో బడ్జెట్‌ పత్రాలను పట్టుకుని మీడియా ముందుకొచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన నిర్మల.. రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి బడ్జెట్‌ పత్రాల కాపీని అందజేశారు. అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయల్దేరారు. 


నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2014-15తో పోలీస్టే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు కేటాయించామన్నారు.
-గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం.
-పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.
-ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం.
-దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంది.
-5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
-ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
-ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశం.
-జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారు.
-3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. 
-ప్రత్యక్ష పన్నులు, రిజిస్ర్టేషన్ లో అనేక మార్పులు తెచ్చాం.
-ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: