2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయ ప్రభంజనం సాధించిన తరువాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అధికారుల్ని, ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక పథకానికి సంబంధించిన నిర్ణయాలు అమలు జరిగే లోపే జగన్ మరో పథకాన్ని అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలను అతి తక్కువ సమయంలోనే అమలు చేస్తున్నారు.

 

2014 ఎన్నికల ఫలితాలతో వైసీపీ డీలా పడింది. కానీ 2019 ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల అమలు కోసం నిర్దిష్టమైన ప్రణాళికను తయారు చేసుకున్నట్లు పథకాలు అమలు చేస్తున్న తీరు చూస్తుంటే తెలుస్తుంది. భవిష్యత్తు గురించి ఎంతో ముందుచూపుతో ఎన్నో నెలల నుండి కష్టపడితే తప్ప ఈ విధంగా పథకాల అమలు చేయడం సాధ్యం కాదు.

 

ఈ ఒక్క నెలలో జగన్ పథకాల అమలు చేస్తున్న తీరు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని పథకాలపై స్వల్పంగా విమర్శలు వచ్చినా మెజారిటీ శాతం ప్రజలకు సంతృప్తినిచ్చేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పథకాల అమలులో అవినీతికి చోటు లేకుండా అర్హులందరికీ పథకాలు అమలు అయ్యేలా చుస్తున్నాడు. ఇదే పరిపాలన రాష్ట్రంలో కొనసాగితే మాత్రం 2024లో కూడా జగన్మోహన్ రెడ్డిగారే సీఎం అయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: