2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. ఏ సర్వే కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరమైన పరాజయం పొందుతుందని అంచనా వేయకపోయింది. 13 జిల్లాల్లోను తెలుగు దేశం పార్టీకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలే వచ్చాయి. 2014లో ఇచ్చిన హామీలను సరిగ్గా అమలు చేయకపోవడం, జన్మభూమి కమిటీలు మొదలైన అంశాలు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవటానికి కారణం అయ్యాయి. 
 
కానీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా చంద్రబాబు ఏం మారలేదు. రైతులకు విత్తనాలు సకాలంలో అందించకపోవటంలో వైసీపీదే తప్పని కానీ తన వల్లే రైతులకు విత్తనాలు సకాలంలో అందించలేకపోయారని వైసీపీ ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు వైసీపీని విమర్శించారు.నిజానికి ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వం విత్తనాలు సేకరిస్తుంది. 
 
కానీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలకు డబ్బు చెల్లించకపోవటం, విత్తనాల సేకరణ పట్ల గత ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలు తన మాటలు మాత్రమే నమ్ముతారని వైసీపీ మాటలు మాత్రం నమ్మరని అభిప్రాయపడ్డాడు. మరి చంద్రబాబు మాటలనే నమ్మితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఎందుకు గెలిచిందో చంద్రబాబుకే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: