తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు  పథకాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది . రైతుబంధు పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఐక్యరాజ్య సమితి సైతం రైతుబంధు పథకాన్ని ప్రశంసించిన విషయం తెల్సిందే . రైతు బంధు పథకానికి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నికల ముందు ప్రధాని మోడీ కూడా పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టడం , తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది .


 కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ అధికారం లోకి వచ్చిన మోడీ , సెంటిమెట్టుగానో లేకపోతే మరేమి తెలియదు కానీ మరొక పథకాన్ని తాజాగా  కాపీ కొట్టారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మిషన్ భగీరథ పథకం తరహాలోనే హర్ ఘర్ కి జల్ పథకాన్ని  కేంద్రం కూడా అమలు చేయాలని నిర్ణయించింది . 2024 నాటికి దేశం లోని ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు .


 జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగం లో వెల్లడించింది . రైతుబంధు తరహాలోనే మిషన్ భగీరథ ను కాపీ కొట్టడం పై టీఆరెస్ నేతలు దేశానికే తమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెబుతున్నారు .

 


మరింత సమాచారం తెలుసుకోండి: