201920 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేసిన పెట్టిన మొదటి బడ్జెట్ ఇది.  ధరలు తగ్గే చిట్టా క్లుప్తంగా పెరిగే చిట్టా చాంతాడంత ఉండటం బట్టి ఈ బడ్జెట్ సామాన్యుడి నడ్డి విరిచేదిగా ఉన్నట్టు చెప్పవచ్చు.  తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులివి! 

పెరిగే వస్తువులు: బంగారం,  పెట్రోల్‌ డీజిల్‌, ఏసీలు, స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్‌లు, సీసీ కెమెరాలు, స్పీకర్లు, డిజిటల్‌ వీడియో రికార్డర్లు, ఆటో మొబైల్‌లో వినియోగించే షీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు, కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌, మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు, ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు, బైక్‌ హార్న్‌లు, లైటింగ్‌ సిస్టమ్‌,  కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను, జీడి పిక్కలు, సబ్బులు, ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు, రబ్బరు, టైర్లు, న్యూస్‌ ప్రింట్‌, మ్యాగజైన్లు, దిగుమతి చేసుకునే పుస్తకాలు, ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు, సిరామిక్‌ టైల్స్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అలాయ్‌ స్టీల్‌ వైర్‌, మెటల్‌ ఫర్నిచర్‌, పీవీసీ పైపులు

తగ్గేవి: గృహ రుణాలు, రక్షణ సామగ్రి, నాఫ్తా, సెల్‌ఫోన్‌ ఛార్జర్లు, సెట్‌టాప్‌ బాక్సులు, మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు



మరింత సమాచారం తెలుసుకోండి: