సాధారణంగా ఆడా-మగా పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం..ఆ పెళ్లికి వచ్చిన పెద్దలు నిండు మనసు తో ఆశీర్వదించి వెళ్తారు.  కానీ ఈ మద్య ప్రకృతికి విరుద్దంగా మగవాళ్లను మగవారు, ఆడవాళ్లను ఆడవారు పెళ్లిళ్లు చేసుకుంటూ షాక్ ఇస్తున్నారు. మరోవైపు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడంతో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు తమ భాగస్వాములను పెళ్లి చేసుకుంటున్నారు.

 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకున్నారు.  చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఆ ఇద్దరి మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. అది ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బలపడింది. ఆ విషయం గ్రహించిన వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.  ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ వరుసకు అక్కాచెల్లెల్లు అవుతారట.

 

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో వాళ్లకు చెప్పడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇద్దరూ ఇంట్లోంచి వచ్చేసి వారణాసి జిల్లా విర్భన్‌పూర్‌లోని రొహానియా ప్రాంతానికి చేరుకున్నారు.  దగ్గరలోని ఆలయానికి చేరుకుని అక్కడి పూజారికి పరిస్థితి వివరించారు. తమకు పెళ్లి జరిపించాలని కోరారు.

 

తొలుత వారి నిర్ణయం విని ఆశ్చర్యపోయిన పూజారి తర్వాత అంగీకరించాడు. ఈ పెళ్లికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై యువతులు ఇద్దరినీ ఆశీర్వదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: