ఈరోజు కేంద్రప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.  ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు  పెట్టుకున్నారు.  ఆ ఆశల నడుమ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది.  గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉన్నది.  ముఖ్యంగా ఇందులో మధ్యతరగతి ప్రజలు గృహనిర్మాణాలపై దృష్టి పెట్టింది.  


దీనికి సంబంధించిన వడ్డీని భారీగా తగ్గించడం విశేషం.  జీరో బడ్జెట్ వ్యవసాయం దిశగా అడుగులు వేయడానికి గల మార్గాలను సూచించింది.  యువత అభివృద్ధి కోసం స్టార్ట్ అప్ లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది.  స్టార్ట్ అప్ కోసం ప్రత్యేకంగా దూరదర్శన్ లో ఛానల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  


ఇప్పుడు యువత వ్యాపారం వైపు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.  ముఖ్యంగా స్టార్ట్ అప్ లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయాలని చూస్తున్నారు.  అలాంటి వారికోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.  యువతను పప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది.  


స్టార్ట్ అప్ ద్వారా వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన నగదును ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో పేర్కొన్నారు.  యువత ఉద్యోగం రాలేదని ఇబ్బంది పడకుండా వ్యాపారం దిశగా అడుగులు వేస్తే ప్రభుత్వం అనుకున్న మేక్ ఇండియా సాధ్యం అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: